
కరోనా మహమ్మారి వల్ల అలియా భట్ తో తన వివాహం కుదరలేదని బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. తర్వాత సోషల్ మీడియాలో వాళ్ల పెళ్లి శుభలేఖలంటూ ఫేక్ ఇన్విటేషన్ కార్డ్స్ హల్చల్ చేశాయి. నిజమేమంటే.. రణబీర్, అలియా నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు.
నిన్న (మంగళవారం) రణబీర్, అలియా జైపూర్‌కు వెళ్లారు. వారి వెంట రణబీర్ తల్లి నీతూ కపూర్ కూడా ఉన్నారు. ఆ వెంటనే, రణవీర్ సింగ్, దీపికా పడుకోనే అక్కడకు వెళ్లారు. రణబీర్ క్లోజ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ అయన్ ముఖర్జీ సైతం ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చాడు.
ఇప్పటికే అలియా తండ్రి మహేశ్ భట్, రణబీర్ సోదరి రిద్ధిమా కపూర్ కూడా జైపూర్‌లో ఉన్నారు. జైపూర్‌లో రంథమ్బోర్లోని అమన్ హోటల్లో వారంతా బస చేశారు. అయితే ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ కోసం వాళ్లక్కడు వెళ్లారంటూ కొంతమంది, నూతన సంవత్సర వేడుకలు జరుపుకోడానికి వెళ్లారంటూ ఇంకొంతమందీ అనుకున్నారు. కానీ అంతర్గత వర్గాలు వేరే విషయాన్ని చెబుతున్నాయి.