ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

48

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ముంబైలో ప్రారంభమైంది. నగరంలోని గోరేగావ్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్ వెనుక రెట్రో గ్రౌండ్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. షూటింగ్‌లో 50 నుంచి 60 మంది టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అయితే, సాయంత్రం 4:13 గంటల సమయంలో సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

మంటలను అదుపుచేయడానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, ఐదు జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సెట్స్‌లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లేరని చిత్ర యూనిట్‌కు చెందిన ఒకరు వెల్లడించారు.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

 

  • 4
    Shares