అక్కడ వరుడి మెడలో వధువు తాళి కడుతుంది..

31

శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవులో 2 సంవత్సరాలకు ఒకసారి సామూహిక వివాహాలు జరిపిస్తారు. 12వేల మంది జనాభా గల ఈ గ్రామంలో ఒకేసారి వందల జంటలకు సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. ఈ సామూహిక వివాహాలలో వరకట్నాలు లేకపోవడం, వధువు వరుడి మెడలో తాళి కట్టడం వంటి వింత ఆచారాలు కనిపిస్తాయి. అయితే ప్రేమికులరోజున పెళ్లి ముహూర్తం ఉండటంతో ఈ ఊర్లో ఫిబ్రవరి 14వ తేదీన సందడి మొదలైంది.

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున అర్ధరాత్రి 2 గంటల 36 నిమిషాలకు ముహూర్తం ఉండగా ఆ ఒక్క ముహూర్తానికే ఈ గ్రామంలోని 42 మంది జంటలు పెళ్లి చేసుకున్నారు. ఈ గ్రామంలోని వారంతా మత్స్యకారులు కావడంతో వారి సంపాదన నామమాత్రంగానే ఉంటుంది. అందుకే దశాబ్దాల కిందట మా ఊరి గ్రామ ప్రజలంతా కలిసి సామూహిక పెళ్లిళ్లు జరిపించి ఖర్చులను తగ్గించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు.

ఈ గ్రామంలో బెహరా, మువ్వల, బైనపల్లి ఇంటిపేరుగా ఉన్న ప్రజలు మాత్రమే నివసిస్తుంటారు. వారి కుటుంబాల నుంచి పెద్దబెహరా, చిన్నబెహరా, బొల్లబాయ్‌ లు కులపెద్దగా వ్యవహరిస్తారు. పూర్వీకులు తీసుకున్న ఆ నిర్ణయం కారణంగానే ఇప్పటికీ ఈ గ్రామంలో సామూహిక వివాహాలను జరిపిస్తున్నారు. గ్రామ పెద్దలు పెళ్లీడుకు వచ్చిన వారందరినీ గుర్తించి ఒకేసారి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు.

  • 8
    Shares