మీకు దణ్ణం పెడతాను నన్ను ఫాలో కావొద్దు – రియా చక్రవర్తి

42

మొన్నటి వరకు సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటి రియాచక్రవర్తి సడన్ గా బాంద్రాలోని రోడ్డు పక్కన ప్రత్యక్షమైంది. బుధవారం ముంబైలోని బాంద్రాలో రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో రియా పూలబొకే కొనడానికని కారు దిగింది. కారు దిగి పూల దుకాణంలో బొకే కొనుగోలు చేసిన తర్వాత కారు వైపు నడుస్తున్నప్పుడు సుశాంత్ అభిమానులు ఆమెను గుర్తు పట్టి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టారు.

విసుగుచెందిన రియా ‘నన్ను ఫాలో కావొద్దు, వీడియోలు తీయకండి’ అని వారిని వేడుకుంది. ఇప్పడు దీనికి సంబందించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. రియా పూలు కొన్న తర్వాత తన కారు దగ్గరకు వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫాలో అయ్యారు. “అబ్ మెయిన్ జా రాహి హూన్, పీచే మాట్ ఆనా” అని ఆమె అనడం మనం వీడియోలో గమనించవచ్చు.

జనవరి 21న సుశాంత్ జన్మదినానికి ఒక రోజు ముందు రియా పువ్వులు కొన్నట్లు అభిమానులు గుర్తించారు. అయితే రియా మాత్రం వీటిపై స్పందించలేదు. రియా వదులుగా ఉండే బూడిద రంగు చొక్కా, నల్ల లెగ్గింగ్ ధరించింది. ఆమె నల్ల మాస్కు ధరించి వీడియోలో కనిపించింది. డ్రగ్స్ లింక్స్ కేసులో జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

  • 4
    Shares