వెళుతున్న కార్ ఎక్కి స్టంట్ చేసి బుక్కయ్యాడు..

144

ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం (మార్చి 13) తన అధికారిక ట్విట్టర్ అకౌంటు లో ఒక వైరల్ వీడియో పోస్ట్‌ను షేర్ చేశారు. ఒక వ్యక్తి కదిలే కారులో నుండి దిగి దాని పైభాగంలో ఎక్కి నడిచి అక్కడ పుష్ అప్స్ కూడా చేస్తున్నాడు. యుపి పోలీసులు ఈ స్టంట్ వీడియో తీసుకొని వారి అధికారిక ట్విటర్ లో “కొన్ని పుషప్‌లు మిమ్మల్ని లా దృష్టిలో పడవేస్తాయి! బలంగా ఉండండి, సురక్షితంగా ఉండండి! ” క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.

ఈ వీడియోను ఫిరోజాబాద్‌లో చిత్రీకరించారు, వీడియోలో ఉన్న వ్యక్తి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు కృష్ణ మురారి యాదవ్ కుమారుడు ఉజ్జ్వాల్ యాదవ్ గా గుర్తించారు. ఈ వీడియో కి సంబందించి ఇద్దరినీ వెంటనే పిలిచినట్లు పోలీసులు వెల్లడించారు. వీడియో వైరల్ అయినందున, ఇలాంటి కేసులు మరిన్ని ఉండవచ్చునని పోలీసులు భావిస్తునారు, మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో మొత్తం దర్యాప్తును వివరిస్తూ ఐపిఎస్ అజయ్ కుమార్ ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.

వీడియోలోని కారును స్కార్పియోగా గుర్తించారు, కారు యజమానితో పాటు అతని కొడుకుపై 2500 రూపాయల చలాన్ వసూలు చేశారు. వీడియో సందేశంలో ‘ఉజ్జ్వాల్ యాదవ్ తన తండ్రి స్కార్పియో ముందు నిలబడి నేను ప్రమాదకరమైన వీడియో చేశానని చెప్తున్నాడు భవిష్యత్తులో నేను అలాంటి తప్పును పునరావృతం చేయను’ అని చెప్పారు.

  • 9
    Shares