షూటింగ్ లో ప్రమాదం నుంచి తప్పించుకున్న సంపూర్ణేష్ బాబు

37

స్పూఫ్ కామిడీ తో అందరినీ ఆకట్టుకునే నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు షూటింగ్ సమయంలో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ‘బజార్ రౌడీ’ అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో ఎత్తు నుంచి బైక్ కిందకు రావలసి ఉంది. సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. ఇక ఆ సన్నివేశం జరుగుతుండగా.. బైక్ పై నుంచి సంపూర్ణేష్ బాబు కిందపడిపోయాడు.

తాడుతో బైక్‏ను దింపుతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అప్రమత్తమైన చిత్రయూనిట్ ఆయన దగ్గరకు చేరుకున్నారు. ఆయన్ను పైకి లేవదీశారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంపూర్ణేశ్ బాబు క్షేమంగా ఉన్నారని, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని చిత్రవర్గాలు తెలిపాయి.

  • 2
    Shares