1.5 కోట్ల ధరతో మోది గొర్రె

81

ఒక గొర్రె ధర మామూలుగా పదివేల రూపాయల వరకు ఉంటుంది. మాంసం బాగా ఉండే గొర్రె అయితే ఇంకో ఐదు వేలు ఎక్కువ ఉండొచ్చు. అయితే తాజాగా ఓ గొర్రె ధర రూ. 70 లక్షలు ధర పలికింది. అంత ధర పెట్టడానికి ముందుకు వచ్చినా గాని.. దాని యజమాని మాత్రం ఆ గొర్రెను అమ్మక పోగా దాన్ని రూ.1.5 కోట్లకు అయితేనే అమ్ముతానని అతను చెప్పడం మరో విశేషం.

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామం మాడ్గల్ (Madgyal breed sheep) జాతి గొర్రెలకు ఫేమస్. అయితే ఈ జాతి గొర్రెల మాంసానికి చాలా డిమాండ్ ఉంటుంది. బాబు మెట్కారి అనే వ్యక్తికి ఆ గ్రామంలో సుమారు 200 వరకు మాడ్గల్ జాతి గొర్రెలున్నాయి. ఆయన దగ్గర ఉన్న ఓ మాడ్గల్ జాతి గొర్రె నచ్చడంతో ఓ వ్యాపారి ఏకంగా రూ.70 లక్షలు పెట్టి దాన్ని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు.

కానీ దానిని అమ్మడానికి ఇష్టపడలేదు. ఆ వ్యాపారి ఎంతకూ వినకపోవడంతో రూ.1.5 కోట్లకు అయితేనే అమ్ముతానని చెప్పాడు. అంత ధర చెబితే అతను కొనడానికి వెనకడుగు వేస్తాడన్న కారణంతో ఆ భారీ ధర చెప్పినట్లు ఆ యజమాని చెప్పాడు. ఆ గొర్రె అసలు పేరు షార్జా అని బాబు మోట్కారి చెప్పాడు.

అయితే దానికి ఇటీవల మోదీ అని పేరు మార్చినట్లు చెప్పాడు. మోదీ ప్రతీ విషయంలో సక్సెస్ అవుతున్నాడని, అలాగే తన మాడ్గల్ గొర్రె కూడా అన్ని మార్కెట్లలో తన డిమాండ్‌ను పెంచుకోవాలని ఆశించి ఆ పేరు పెట్టానని వివరించాడు. చాలా మంది పోటీ పడి ఆ గొర్రె ధరను ఇంకా కోట్లలోకి తీసుకుపోయే అవకాశం ఉందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

  • 8
    Shares