నవ్వుతూ ఆత్మహత్య చేసుకుంది.. చావును కూడా ఆనందంగా ఆహ్వానించింది..!

28

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అయేషాకి 2018లో రాజస్థాన్‌ కి చెందిన ఆరిఫ్‌ ఖాన్‌తో వివాహం జరిగింది. మంచి సంబంధం అని ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లి చేశారు. అప్పటివరకు ఆమె జీవితం ఎంత సాఫీగా సాగిందో పెళ్లి అయ్యాక అంత దారుణంగా తయారైంది. అయేషాకి పెళ్లైన కొద్ది రోజుల నుంచే ఆమె భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమె భర్త, అత్తింటివారు వేధింపులు మొదలుపెట్టారు.

ఆమె భర్త ఆరిఫ్‌ ఖాన్‌ 2019 అయేషాను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఇరుకుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకానొక సమయంలో ఆమె భర్త ఏదైనా నదిలో దూకి చావు అని అన్నాడు. అయేషా కూడా బెటర్ అలా చేయడమే మంచిది అనిపించింది. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని భావించి సబర్మతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ సెల్ఫీ వీడియోను తీసింది.

తాను సంతోషంగానే వెళ్లిపోతున్నానని, తన గురించి ఎవరూ బాధ పడొద్దని కోరింది. తనపైన ఎలాంటి ఒత్తిడి లేదంది. నాకు అన్నీ దొరికాయి. ఇక స్వర్గం కూడా దొరుకుతుందో, లేదో చూద్దాం అంటూ నదిలో దూకేసింది. ఈ విషయం తెలియగానే ఆమె కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, అప్పటికే అయేషా మునిగిపోయింది. సహాయ బృందం ఆయేషా మృతదేహాన్ని నది నుండి వెలికి తీశారు.

  • 32
    Shares