తల్లిని కాటేసిన పాము.. అది కాస్తా విసిరివేయడంతో ..

36

మహారాష్ట్ర చంద్రాపూర్‌ కు చెందిన వలస కూలీలు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఊటుకురు వచ్చి మిరప కోతలకు రోజు వారి కూలీగా వెళ్తున్నారు. గ్రామంలోని బీసీ కాలనీలో వలస కూలీలు గుడారాలు వేసుకుని ఉంటున్నారు. అందులో ఏడాదిన్నర చిన్నారికి తల్లి అయిన శృతి ప్రమోద్‌ భోయర్‌ కూడా ఉంది.

అర్థరాత్రి సమయంలో నిద్రమత్తులో బిడ్డకు పాలు ఇస్తున్న శృతిని పాము కాటు వేసింది. పాము కాటుకు మెలుకువ రావడంతో కంగారు పడ్డ శృతి వెంటనే ఆ పాము తన బిడ్డను ఎక్కడ కాటు వేసిందో అనే భయంతో మరో ఆలోచన లేకుండా పామును పట్టుకుని ఒక్క ఉదుటన విసిరేసింది.

అలా విసిరేసిన పాము పక్కనే ఉన్న రూపేష్ ప్రకాష్ అనే యువకుడిపై పడటంతో అతడిని కూడా కాటువేసింది. శృతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహంను బంధువులు తమ సొంత ప్రాంతానికి తీసుకుపోగా విజయవాడలో రూపేష్‌ చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు తెలియజేశారు.

  • 5
    Shares