కోపంలో తల్లిని చెంపదెబ్బ కొట్టాడు.. ప్రాణాలు విడిచింది..!

38

దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో నివసించే అవతార్ కౌర్ (76) కు పక్కింట్లో నివసించే వారితో పార్కింగ్‌ విషయంలో సోమవారం మధ్యాహ్నం గొడవ జరిగడంతో విషయం కాస్తా పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లింది. పక్కింటి వారు అవతార్‌ కౌర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పై కొడుకు రణ్‌బీర్‌కు కోపం వచ్చింది.

ఈ విషయమై ఇంటి బయట అవతార్‌కు, రణ్‌బీర్‌కు, అతని భార్య కొంతసేపు వాదించుకున్నారు. ఈ క్రమంలో రణ్‌బీర్ తన తల్లి అవతార్‌ను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో అమె అక్కడిక్కడే కుప్పకూలి స్పృహ కోల్పోయింది. ఆమె కోడలు లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

వెంటనే అవతార్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు రణ్‌బీర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

  • 5
    Shares