ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకుపోయిన కారు.. ముగ్గురు మృతి

50

జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ కెనాల్ లోకి కారు దూసుకెళ్లింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈత రాకపోవడంతో ఊపిరాడక కాలువలో మునిగి చనిపోయారు. ఒకరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

మేడిపల్లి మండలం కట్లకుంట దగ్గర సోమ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. జోగన్ పల్లికి చెందిన అమరేందర్ ఫ్యామిలీతో ఆయన సొంత ఊళ్లో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో అమరేందర్ తో పాటు భార్య శిరీషా, కూతురు శ్రేయ నీటిలో మునిగిపోయారు. కొడుకు జయంత్ ఎలాగో సురక్షితంగా బయటపడ్డాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు క్రేన్ స‌హాయంతో కారుతో పాటు ముగ్గురి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కుతీశారు.