సూర్యపేటలో కరోనా కలకలం.. ఒకే ఇంట్లో 22 మందికి పాజిటివ్‌..

51

సూర్యాపేటలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన పుట్టిస్తుంది. ఈ 22 మందిని కలిసిన మరో ఆరుగురికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరైన వీరికి కరోనా వైరస్‌ సోకింది. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఓ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తగా పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలిందని డీఎంహెచ్‌ఓ తెలిపారు. బాధితుల్లో లక్షణాలేవీ కనిపించకపోయినా పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యాదాద్రి టౌన్‌ షిప్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటిని సర్వే చేస్తున్నారు. బాధితులంతా స్వీయ నిర్భందంలో ఉన్నారు.

  • 4
    Shares