గూగుల్ నావిగేషన్ డైరెక్షన్ తో బురదలో ఇరుక్కుపోయారు..

జ‌ర్మనీ నుంచి ఉత్త‌రాఖండ్ వ‌చ్చిన ఓ యాత్రికుల బృందం ఐ10 కారులో ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. గూగుల్ నావిగేషన్ ప్ర‌కారం ఉద‌య్ పూర్ కు బ‌య‌లుదేరారు. రాజ‌స్థాన్ లోని న‌వానియా హైవేపై పోతుండ‌గా మెనార్ అనే ఊరు వ‌చ్చింది.

అక్క‌డి నుంచి మ‌ట్టి రోడ్డులో పోతే త్వ‌ర‌గా ఉద‌య్ పూర్ చేరుకోవ‌చ్చున‌ని సంకేతాలిచ్చింది. దీంతో జాతీయ ర‌హ‌దారి నుంచి మ‌ట్టిరోడ్డుకి మ‌ళ్ళారు. కొంచెం దూరం పోగానే రోడ్డు అద్వాన్నంగా ఉండి కారు బుర‌ద‌లో కూరుకుపోయింది.

ఆ ప‌ల్లె ప్రాంతాల ప్ర‌జ‌లే ఈ రోడ్డును ఉప‌యోగించ‌డం మానేశారు. బుర‌ద‌లో చిక్కుకున్న వీరిని చూసిన స‌మీప గ్రామ‌స్తులు ఓ ట్రాక్ట‌ర్ ను తీసుకొచ్చారు. ట్రాక్ట‌ర్ సాయంతో దాదాపు 5 గంట‌ల ప్ర‌య‌త్నం త‌ర్వాత ఆ కారు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గూగుల్ నావిగేషన్

i10 car tourists from germany google navigation గూగుల్ నావిగేషన్ గూగుల్ నావిగేషన్