మరో ఛాన్స్ ఇచ్చిన కేంద్రం.. ఆధార్- పాన్ లింక్ గడువు పొడగింపు..

పాన్, ఆధార్ లింక్ ( aadhar pan link ) చేయమని కేంద్రం డెడ్ లైన్ పెట్టి మార్చి 31వ తేదీకి గడువు ఇచ్చింది. కానీ ఇంతవరకు కొందరు లింక్ చేయలేదు. దీంతో వారి కోసం మరో అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనా వైరస్ వల్ల బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నందున.. వెసులుబాటు కల్పించామని ఆదాయపు పన్ను శాఖ తెలియజేసింది. ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోనట్లయితే రూ.వెయ్యి వరకు ఫైన్ విధిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. అదీ ప్రస్తుతానికి వర్తించదని తెలిపింది. సెక్షన్ 148 ఆదాయపు పన్ను 1961 ప్రకారం చర్యలు తీసుకున్నామని ఐటీ శాఖ తెలిపింది.

గడువు తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ మరోసారి అవకాశం ఇచ్చింది. పాన్ కార్డుకు – ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్, పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది.

aadhar pan link extanded