ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పేలి భార్య మృతి.. భర్త కండిషన్ సీరియస్

Oxygen Concentrator:

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ (Oxygen Concentrator) పేలి ఒక మహిళ మరణించింది. కరోనాతో బాధపడుతున్న ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్‌ గంగాపూర్‌‌లో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంగాపూర్ సిటీలోని ఉదయ్ మోర్ ఏరియాలో ఉండే ఐఏఎస్ అధికారి హర్ సహాయ్ మీనా సోదరుడు సుల్తాన్ సింగ్‌ కరోనా కారణంగా చాలా రోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. క్రమంగా కోలుకుంటున్న అతడికి ఇంట దగ్గరే ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పెట్టారు.

సుల్తాన్ భార్య సంతోష్ మీనా అతడిని చూసుకుంటోంది. శనివారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో లైట్ స్విచ్‌ ఆన్ చేయగానే ఒక్కసారిగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పేలిపోయింది. ఆక్సిజన్ లీకేజ్‌ కారణంగా అది పేలి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. పేలుడు శబ్దం విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి, మంటల్లో చిక్కుకున్న దంపతులను బయటకు తీసుకొచ్చారు.

వారిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తుండగా సంతోష్​ మీనా మరణించింది. సుల్తాన్ సింగ్ కండిషన్ సీరియస్‌గా ఉంది. మెరుగైన చికిత్స కోసం గంగాపూర్‌‌ నుంచి జైపూర్‌‌కు తరలించారు. సుల్తాన్‌, మీనాకు పదేండ్లు, 12 ఏండ్ల కొడుకులు ఇద్దరు ఉన్నారు.  వారిద్దరూ ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు.

అజిత్ బాటలో నివేదా పేతురాజ్.. వీడియో

తెలుగు, తమిళ సినెమాలలో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్లలో నివేదా పేతురాజ్‌ (niveda pethuraj) ఒకరు. ఈమె తాజాగా ఈమె ఓ స్టార్‌ హీరోను ఫాలో అవుతున్నారు. అది కూడా రిస్క్‌ తీసుకుని. ఇంతకీ నివేదా పేతురాజ్‌ రియల్‌ లైఫ్‌లో రిస్క్‌ తీసుకుంటూ ఫాలో అవుతున్న హీరో ఎవరో తెలుసా?.. అగ్ర కథానాయకుడు అజిత్‌.

 

View this post on Instagram

 

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)

సాధారణంగా అజిత్‌ సినిమాలతో పాటు ఫార్ములా వన్‌ రేసర్‌ కూడా. ఇప్పుడు నివేదా కూడా నేను సైతం అంటూ ఫార్ములా వన్‌ రేసర్‌ కావాలనుకుంది. అందులో భాగంగా ఫార్ములా రేస్‌ కార్‌ లెవల్‌-1 శిక్షణను మొమెంటమ్‌ స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ రేసింగ్‌ పాఠశాలలో  పూర్తి చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)

ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ, ‘నాకు బాల్యం నుంచే కార్లపై ఎంతో ఇష్టం వుండేంది. నేను 8వ తరగతి చదువుతున్నపుడే మా ఇంటికి సమీపంలో వుండే మా అత్తవారికి స్పోర్ట్స్‌ కారు వుండేది. అప్పటి నుంచే స్పోర్ట్స్‌ కార్లపై మరింత ఇష్టం పెరిగింది. ఈ క్రమంలో గత 2015లో ఎంతో ఇష్టపడి డూడ్జ్‌ చాలెంజర్‌ స్పోర్ట్స్‌ కారును కొనుగోలు చేశాను. యూఏఈలో స్పోర్ట్స్‌ కారును కొనుగోలు చేసిన రెండో మహిళ నేనే కావడం గమనార్హం. అయితే, ఈ కారుకు వి6 ఇంజన్‌ను అమర్చడంతో అది అమిత వేగంతో వెళుతుంది.

niveda pethuraj నివేద పేతురాజ్ niveda pethuraj

niveda pethuraj

గూగుల్ నావిగేషన్ డైరెక్షన్ తో బురదలో ఇరుక్కుపోయారు..

జ‌ర్మనీ నుంచి ఉత్త‌రాఖండ్ వ‌చ్చిన ఓ యాత్రికుల బృందం ఐ10 కారులో ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. గూగుల్ నావిగేషన్ ప్ర‌కారం ఉద‌య్ పూర్ కు బ‌య‌లుదేరారు. రాజ‌స్థాన్ లోని న‌వానియా హైవేపై పోతుండ‌గా మెనార్ అనే ఊరు వ‌చ్చింది.

అక్క‌డి నుంచి మ‌ట్టి రోడ్డులో పోతే త్వ‌ర‌గా ఉద‌య్ పూర్ చేరుకోవ‌చ్చున‌ని సంకేతాలిచ్చింది. దీంతో జాతీయ ర‌హ‌దారి నుంచి మ‌ట్టిరోడ్డుకి మ‌ళ్ళారు. కొంచెం దూరం పోగానే రోడ్డు అద్వాన్నంగా ఉండి కారు బుర‌ద‌లో కూరుకుపోయింది.

ఆ ప‌ల్లె ప్రాంతాల ప్ర‌జ‌లే ఈ రోడ్డును ఉప‌యోగించ‌డం మానేశారు. బుర‌ద‌లో చిక్కుకున్న వీరిని చూసిన స‌మీప గ్రామ‌స్తులు ఓ ట్రాక్ట‌ర్ ను తీసుకొచ్చారు. ట్రాక్ట‌ర్ సాయంతో దాదాపు 5 గంట‌ల ప్ర‌య‌త్నం త‌ర్వాత ఆ కారు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గూగుల్ నావిగేషన్

i10 car tourists from germany google navigation గూగుల్ నావిగేషన్ గూగుల్ నావిగేషన్