కూర వండటానికి తెస్తే తలరాత మార్చేసింది..

38

థాయ్‌ ల్యాండ్ లో కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే మహిళ రెండు నెలల క్రితం 163 రూపాయలు పెట్టి నత్తలను కొన్నది. వాటిని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి కట్‌ చేస్తుండగా.. ఓ నత్తలోపల ఆమెకు ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న రాయి లాంటిది కనిపించింది. దాన్ని తల్లికి చూపించింది. తల్లి చెప్పిన విషయం విని కొడ్చకార్న్‌ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.

నత్త కడుపులో దొరికిన ఆ పదార్థం ఆరు గ్రాముల బరువున్న 1.5 సెంటిమీటర్ల వ్యాసార్థం గల అరుదైన మేలు జాతికి చెందిన మెలో జాతికి చెందిన ముత్యం..!! అరుదైన ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు ఉంటుంది. తనకు దొరికిన ముత్యం గురించి కొడ్చకార్న్‌ మాట్లాడుతూ

‘‘నత్తలు శుభ్రం చేస్తుండగా దొరికిన వస్తువును మా అమ్మకు చూపించాను. ఆమె దాన్ని మెలో ముత్యం అని, కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందని చెప్పింది. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మంచి రేటు వస్తే మా కష్టాలు తీరిపోతాయి. వచ్చే డబ్బుతో క్యాన్సర్ తో బాధపడుతున్న మా అమ్మకు మంచి వైద్యం చేయించాలని చెప్పింది. అమ్మ వైద్యం కోసం 23.34 లక్షల రూపాయలు అవసరం అవుతాయని డాక్టర్లు చెప్పారు, కానీ తమకు అంత స్తోమత లేక సాధారణ వైద్యం చేయిస్తున్నాం. కానీ ఈ ముత్యం అమ్మితే మంచి డబ్బు వస్తే ముందుగా అమ్మకు మంచి వైద్యం చేయించాలి” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.