ఈమెకు మందు అలవాటు లేదు.. కానీ బాడీలో మద్యం ఉత్పత్తి అవుతది

41

USA కు చెందిన ఒక మహిళ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మందు తాగకున్నా ఆమెకు మత్తు వస్తోంది. సదరు మహిళ పేరు సారా లిఫబర్. సారాకు మందు తాగే అలవాటు లేదు. అయినా ఆమెకు మత్తుగా అనిపిస్తోందట. రీసెంట్‌‌గా సారాకు బ్రీత్‌అనలైజర్ టెస్టులు చేయగా అందులో ఆరుసార్లు ఓవర్ లిమిట్ రిజల్ట్ వచ్చింది.

సారా హెల్త్ కండీషన్ చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. తొలుత సారాను చూసి ఆమె ఆల్కహాలిక్ అని వైద్యులు అనుకున్నారు. కానీ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె ఆటో బ్రెవెరీ సిండ్రోమ్ (ఏబీఎస్) అనే వింత వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు.

సారా శరీరంలో నుంచి ఇథనాల్ అనే రసాయనం ఎక్కువ మోతాదులో విడుదలవుతోందని, అది రక్తంలోకి వెళ్తుండటంతో సారాకు మత్తుగా అనిపిస్తోందని తేల్చారు. సారా లివర్ పూర్తిగా దెబ్బతిందని, వెంటనే లివర్ ట్రాన్స్‌‌ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. గత కొన్నేళ్లుగా ఆమె ఈ వ్యాధితో బాధపడుతోందని, ప్రస్తుతం సారాకు యాంటీఫంగల్ డ్రగ్ ఇస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు.

  • 5
    Shares