ఒక్క వాంతితో కోటీశ్వరరాలైంది..

95

థాయ్‌లాండ్‌లోని నాఖోన్ సి దమ్మరత్‌ ప్రావిన్స్ కు చెందిన సిరిపార్న్ అనే మహిళ(49) బీచ్ లో వాకింగ్ కు వెళ్లింది. ఇసుక తిన్నెల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెకు దూరంగా ఓ పెద్ద రాయిలాంటిది కనిపించింది. దాన్ని తాకి చూస్తే చాలా మెత్తగా అనిపించింది. చేప వాసన రావడంతో దేనికైనా పనికొస్తుందని ఇంటికి తీసుకెళ్లింది.

పక్కింటి వాళ్ళకు దీని గురించి మీకేమైనా తెలుసా? అని అడిగింది. అది తిమింగలం వాంతి(అంబర్గ్రిస్-ambergris)లా ఉందని, దానికి చాలా విలువ ఉంటుందని వారు చెప్పారు. సుమారు ఏడు కిలోల బరువున్న ఆ తిమింగిలం వాంతి విలువ రూ.1.8 కోట్లు విలువ ఉంటుందని చెప్పడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.

సిరిపార్న్‌కు అంబర్ర్గిస్ లభించందనే సమాచారం అందుకున్న నిపుణులు త్వరలోనే దాన్ని పరీక్షించి నగదు అందజేయనున్నారు. దీంతో ఆ లక్కీ లేడీ త్వరలోనే కోటీశ్వరరాలు కానుంది. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ జాలరికి కూడా ఇలానే తిమింగలం వాంతి దొరికింది. చేపల వేట కోసం సముద్రానికి వెళ్లగా అది లభించింది. అది అంబర్గ్రిస్ అని తేలింది. ఓ వ్యాపారి రూ.23.5 కోట్లు చెల్లించి జాలరి నుంచి దాన్ని కొన్నాడు. దీంతో జాలరి జీవితమే మారిపోయింది.

వాంతికి ఎందుకంత డిమాండ్? ‘అంబర్గ్రిస్’ అనేది స్మెర్మ్ వేల్స్ నుంచి పుడుతుంది. పొడవైన ముక్కుతో ఉండే ఈ తిమింగిలాలు స్పెర్మ్ ఆయిల్‌ను విడుదల చేస్తాయి. దాన్నే ‘అంబర్గ్రిస్’ అంటారు. తిమింగలం దాన్ని నీటిలోకి వాంతి చేస్తుంది. అదే సముద్ర తీరానికి కొట్టుకొస్తుంది. దీన్నే నీటిపై తేలియాడే బంగారం అని కూడా అంటారు. ‘అంబర్గ్రిస్’ను ఎక్కువగా ఖరీదైన పెర్‌ఫ్యూమ్‌లలో ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల పెర్ఫ్యూమ్ ఎక్కువ సేపు వాసన కోల్పోకుండా ఉంటుంది.

  • 6
    Shares