తప్పతాగి కార్ తో యాక్సిడెంట్ చేసిన అమ్మాయి… బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ

37

చెన్నైకి సమీపంలోని తిరువల్లూరులో మద్యం మత్తులో ఓ అమ్మాయి నడిరోడ్డుపై రెచ్చిపోయింది. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆ ఆనందాన్ని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది. ఒక స్టార్ హోటల్లో అందరూ తిని మందు తాగారు. ఆ తర్వాత అమ్మాయి మహీంద్రా థార్ లో ఇంటికి బయలుదేరింది. మద్యం మత్తులో ముందువెళ్తున్న వ్యాన్ ని బలంగా ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న అమ్మాయి ఆ వ్యాన్ డ్రైవర్ పై నువ్వే తప్పు చేశావ్ అని ఎదురుదాడికి దిగింది. దీంతో గొడవ పెద్దదై చుట్టూ జనం చేరారు.

విషయం పోలీసులకు చేరగానే అక్కడికి చేరుకున్నారు. ఆ అమ్మాయిని చూడగానే పోలీసులకు మ్యాటర్ అర్ధమైంది. ఆమె అసలే  తాగుంది, పైగా మహిళ. దీంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారు. ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అమ్మాయి వినలేదు. సరికదా, పోలీసులను చూడగానే మరింత రెచ్చిపోయింది. నేను తప్పు చేసుంటే, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యండి అని పోలీసులను చాలెంజ్ చేసింది.

ఇంతలో స్పాట్ కి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు. వారు ఆమెకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె కంట్రోల్ కాలేదు. దీంతో ఫ్రెండ్స్ బలవంతంగా ఆమెని మరో కారులో ఇంటికి తీసుకెళ్లిపోయారు. పోలీసులు మహీంద్రా థార్ వాహనాన్ని స్టేషన్ కి పట్టుకెళ్లారు. ఉదయాన్నే అమ్మాయిని, వారి తల్లిదండ్రులను స్టేషన్ కి తీసుకురావాలని అమ్మాయి ఫ్రెండ్స్ తో పోలీసులు చెప్పారు.

కాగా, మహిళా కానిస్టేబుల్ ఉంటేనే.. స్త్రీని అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉంచుకోవాలన్నా.. స్టేషన్ లో కచ్చితంగా మహిళా కానిస్టేబుల్ ఉండాలని రూల్ ఉంది. దీంతో పోలీసులు ఆమెని టచ్ చెయ్యకుండా వదిలేశారు. తెల్లారాక చూసుకుందామని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెపై కేసు నమోదు చేశారో లేదో తెలియాల్సి ఉంది.

  • 6
    Shares