ఇకపై సినిమా హాళ్లన్నీ హౌస్ ఫుల్

32

లాక్ డౌన్ తో థియేటర్స్ 2020 లో చాలా వరకు మూత పడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి గతేడాది అక్టోబర్‌లో కేంద్రం ఓకే చెప్పింది. కరోనా తగ్గుముఖం పట్టడం, కరోనా వాక్సిన్ కూడా రావడంతో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెనింగ్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త గైడ్ లైన్స్ ని విడుదల చేసింది.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. టికెట్లు కొనుగోలు చేసే ప్రాంతంలో, థియేటర్‌ వెలుపల వెయిటింగ్‌ రూమ్స్‌ వద్ద ప్రేక్షకులు తప్పనిసరిగా ఆరు అడుగుల దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి. థియేటర్‌ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ప్రవేశం వద్ద శరీర ఉష్ణోగ్రతను కొలిచే ‘థర్మల్‌ స్ర్కీనింగ్‌’ ఏర్పాట్లు ఉండాలి. హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. హాలులో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్‌ మధ్యలో ఉండాలి.

  • 4
    Shares