This Day in History: 1942-07-10

కోట శ్రీనివాసరావు

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1945జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇతని పేరు కోట ప్రసాద్. ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు నంది పురస్కారాలు అందుకున్నాడు.