This Day in History: 1954-07-14

తనికెళ్ళ భరణి

తనికెళ్ళ భరణి (జననం: జులై 141956) రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు.