This Day in History: 1983-07-19

సింధు తులాని

సింధు తులాని ఒక తెలుగు సినీ నటి. తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఫెయిర్ అండ్ లవ్లీ క్రీము ప్రకటనలో నటించింది. సింధు 2003 లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. గుణ్ణం గంగరాజు ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తీసినా మంచి విజయం సాధించింది. దీని తరువాత ఆమెకు వేరే సినిమాలలో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన అతనొక్కడే సినిమాతో సింధుకు ఇంకా మంచి పేరు వచ్చింది. దీని తరువాత తమిళ నటుడు శింబుతో చేసిన ద్విభాషా చిత్రం మన్మథతో మరో విజయం సాధించింది. తెలంగాణా సాంప్రదాయమైన బతుకమ్మను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాలో ఆమె ప్రధాన పాత్రను పోషించింది. మొదట్లో కథానాయికగా నటించిన తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోకు వదిన గా, ఆది (నటుడు) హీరోగా వచ్చిన ప్రేమ కావాలి సినిమాలో నటనకు ఆస్కారమున్న సహాయ పాత్రలు పోషిస్తోంది.