కోళ్ల పారం లోంచి పిల్లి అరుపులు.. భయంతో పరిగెత్తుకెళ్లిన ఫౌల్ట్రీ రైతు..

34
Three Orphan Kittens

ఇరాక్‌ లోని గోరన్ ఎ సుర్చి అనే రైతు తన కోళ్ల ఆవరణలో ఒక షాకింగ్ దృశ్యాన్ని చూశాడు. తొలుత అతడి కోళ్ల ఫారం నుంచి పిల్లి అరుపులు వినిపించాయి. దీంతో పిల్లి తన కోళ్లను అటాక్ చేసిందని భావించిన సదరు రైతు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లాడు. కోడి అక్కడ తన రెక్కల కింద మూడు పిల్లి పిల్లల్ని దాచి ఉంచింది.

ఆ పిల్లల తల్లి చనిపోయి ఉంది. దీంతో ఆ మూడు పిల్లలు అమాయకంగా అరవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆ పిల్లల వేధనను అర్థం చేసుకున్న కోడి వాటిని అక్కున చేర్చుకుని తన పిల్లల్లా చూసుకోవడం ప్రారంభించింది. టిక్ టాక్ తో మొదలైన ఈ కోడి కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Three Orphan Kittens
  • 15
    Shares