టిక్ టాక్ దుర్గారావు కాస్తా బిగ్ బాస్ దుర్గారావు కాబోతున్నాడా..

39

అప్పుడే సీజన్ 5కు సంబంధించి ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు టీమ్ సెలబ్రిటీల వేటలో ఉన్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, యాంకర్ రవి, హైపర్ ఆదిలను ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ సంప్రదించినట్టు సమాచారం. అయితే, ఈ జాబితాలో ఇప్పుడు టిక్ టాక్ దుర్గారావు చేరారని వదంతులు వినిపిస్తున్నాయి.

‘పలాస’ సినిమాలో ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాటతో పాపులర్ అయిన దుర్గారావు.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘క్రాక్’ సినిమాలో ఒక పాటలో స్టెప్పులేశారు. ‘FCUK’ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జగపతిబాబుతో కలిసి దుర్గారావు వేదికపై డ్యాన్స్ చేశారు. మరి ఇంత క్రేజ్ ఉన్న దుర్గారావును బిగ్ బాస్ వాళ్లు వదులుతారా?

అందుకే బిగ్ బాస్ టీం ఇప్పటికే దుర్గారావును సంప్రదించారని సమాచారం. ఒకవేళ దుర్గారావు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్తే ఇప్పటి వరకు చూడని కొత్త రకం వినోదం మనం చూడొచ్చు. టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయినప్పటికీ దుర్గారావు ఆర్థికంగా పెద్దగా స్థిరపడలేదు. బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఆయన ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే.. ముందు ‘బిగ్ బాస్‌లోకి టిక్ టాక్ దుర్గారావు’ వదంతు నిజమవ్వాలి.

  • 6
    Shares