చరిత్రలో ఈ రోజు ? »  

చరిత్రలో ఈ రోజు ?

దినోత్సవం

ప్రపంచ బొల్లి దినోత్సవం

సంఘటనలు

1932 : భారత జాతీయ క్రికెట్ జట్టు మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానం లో ఆడింది. టెస్ట్ క్రికెట్ హోదా పొందిన ఆరవ జట్టుగా అవతరించింది.

1975 : భారతదేశంలో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ని ప్రకటించింది.

1983: మొట్టమొదటి సారిగా ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భారత కప్పు గెలుచుకుంది.

జననం

1945 : ఊర్వశి శారద (తడిపర్తి సరస్వతి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నృత్యకారిణి, రాజకీయవేత్త.

1981 : పూజ గౌతమి ఉమాశంకర్ జననం. భారతీయ శ్రీలంకన్ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్.

మరణం

2009 : కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జోసెఫ్ జాక్సన్ మరణం. అమెరికన్ గాయకుడు, పాటల రచయిత, నృత్యకారుడు, పరోపకారి. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు.

చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది..

error: