ట్రైన్స్‌లో ఇక నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు..!

30

ట్రైన్ జర్నీ చేయాలనుకునే వారికి శుభవార్త. ఇండియన్ రైల్వేస్ మళ్లీ ఇక్యాటరింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రైల్వే ప్రయాణికులు ట్రైన్‌లో వారికి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వొచ్చు. ఫిబ్రవరి 1 నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలోనే ఈ సర్వీసులు అందుబటులో ఉన్నాయి. 250 ట్రైన్స్‌లో ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ గతంలో ఇక్యాటరింగ్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇవి మళ్లీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి. రైల్వే ప్రయాణికులు ట్రైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని భావిస్తే ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్‌ను వాడాలి. ఈ యాప్ ద్వారా సులభంగా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

లేదా https://www.ecatering.irctc.co.in/ వెబ్‌సైట్ ద్వారా కూడా ఫుడ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 500 రెస్టారెంట్ల ద్వారా ఫుడ్ డెలివరీ పొందొచ్చు అదీకూడా మీకు నచ్చిన ఫుడ్ పొందొచ్చు. దీనికోసం పీఎన్ఆర్ నెంబర్, ట్రైన్ పేరు, బెర్త్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైన్ జర్నీ చేసే వారికి ఈ సర్వీసు వల్ల మంచి ఆహారం దొరికినట్టే.

  • 3
    Shares