తినేసి బిల్లు కట్టకపోగా.. ఫాల్తు కేసు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు

28

ఉత్తరప్రదేశ్‌ ఈటా జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ ప్రవీణ్ కుమార్ ధాబాకు వచ్చి భోజనం చేశారు. 400 రూపాయల బిల్లు అయితే వారు 80 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కనీసం రూ.200 అయినా చెల్లించాలని ప్రవీణ్ కుమార్ పోలీసులని కోరాడు.

మద్యం మత్తులో ఉన్న పోలీసులు మమ్మల్నే బిల్లు కట్టమంటా అంటూ ప్రవీణ్ పై దాడికి దిగారు. ధాబా ఓనర్ కి అక్కడున్న 9 మంది సపోర్ట్ గా నిలిచారు. చివరికి పోలీసులు బిల్లు కట్టకుండానే వెళ్లిపోయారు. కొద్దినిమిషాల్లోనే 15మంది పోలీసులు వచ్చి ప్రవీణ కుమార్ తమ్ముడిని, ధాబా ఓనర్ కి మద్దుతుగా నిలిచిన 9మంది కస్టమర్లను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

కొత్వాలి దేహాట్ పోలీస్ స్టేషన్ లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో ‘ధాబాలో 10 మంది ముఠా దోపిడీకి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు’. తమపై కాల్పులకు పాల్పడ్డారని కూడా పోలీసులు ఆరోపించారు. వారి వద్ద నుంచి ఆరు దేశీ తుపాకులను, 2 కిలోల నిషేధిత డ్రగ్స్ మరియు 80 లీటర్ల అక్రమ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు రికార్డుల్లో చూపించారు. ఈ ఘటన జరిగిన 40 రోజుల తర్వాత వివాదం కాస్త ముదరడంతో జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించారు.

  • 6
    Shares