భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మొదటి భార్య, నిజం తెలిసి ఉతికారేసిన రెండో భార్య

38

యాదాద్రి భువగిరిజిల్లాకు చెందిన వేముల పరశురామ్ అనే వ్యక్తి బోర్‌వెల్ వాహన పనుల మీద వెళ్తున్నానంటూ భార్యకు చెప్పి కొంతకాలంగా వారానికి రెండు మూడు రోజులు ఇంటికి రావడం లేదు. అతనికి ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే మొదట్లో అతడి మాటలు నిజమేనని నమ్మింది.

అయితే ఇటీవల బోర్‌వెల్ పనుల కోసమని వెళ్లి మూడు నెలల తర్వాత తిరిగిరావడంతో అనుమానం వచ్చింది. ఇదే సమయంలో ఊరికి బయలుదేరిన అతడిని వెంబడించింది. తనవెంట భార్య వస్తున్న విషయాన్నీ కనిపెట్టని పరశురామ్ కామారెడ్డిలోని రెండో భార్య ఇంటికి చేరుకున్నాడు.

ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్థానికులకు ఈ విషయం చెప్పి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. అయితే పరశురామ్ తనకు ఎవరూ లేరని నమ్మించి, తనను పెళ్లి చేసుకున్నాడని రెండో భార్య చెప్పడంతో అందరూ షాకయ్యారు. దీంతో ఇద్దరూ భార్యలు కలిసి అతడిని చితకబాదారు.

  • 9
    Shares