పిచ్చికి పరాకాష్టా..? లేక ఫోటోషాపా.. వైరల్ ఫోటో పై నెటిజన్ల రియాక్షన్

51

పర్వతం అంచున నిలబడి ఉన్న ఓ జంట వైరల్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన తర్వాత చాలా మంది ఒళ్లు జలదరిస్తుంది అని కొందరు కామెంట్ చేస్తే పిచ్చికి పరాకాష్ఠ అని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ పిక్ నిజమా లేదా అబద్ధమా? అని సెర్చ్ చేస్తున్నారు.  ఎందుకంటే, ఈ మధ్య కొన్ని ఫోటోషాప్‌లో ఎడిట్ చేసిన ఫోటోలు కూడా ఇదే స్థాయిలో వైరలవుతున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఫోటోను టర్కీలోని గులేక్ ప్యాలెస్‌లో క్లిక్ చేశారు. ఈ ఫోటోలో ఒక యువకుడు కొండ అంచుపై నుంచి వాలిపోయినట్లు ఉండగా, ఒక అమ్మాయి అక్కడే నిలబడి అతనికి చేయి అందిస్తున్నట్లు ఉంది. ఈ పిక్ మొదటిసారి చూసిన వ్యక్తి భయపడటం ఖాయం. రెడ్‌స్‌రెడిట్స్ అనే యూజర్ దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ చివరి ఫోటో ను చూసిన కొందరు మాత్రం ఫోటోగ్రాఫర్ స్కిల్స్‌ను అభినందించాల్సిందే అంటున్నారు.

  • 9
    Shares