విశాఖ ఉక్కును అమ్మేది ఎవడు కొనేది ఎవడు

37

విశాఖ ఉక్కు ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. కార్మికుల పోరాటం అన్ని వర్గాలను కదిలిస్తోంది. మరో వైపు, ఐక్య ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచేందుకు రోడ్ మ్యాప్ సిద్దం అయింది. రాజకీయ, ఉద్యోగ సంఘాలు భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటించాయి. ఒక రకంగా విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది.

విశాఖ ఉక్కును అమ్మేది ఎవడు కొనేది ఎవడు నినాదాలతో హోరెత్తించారు. మరో వైపు, ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటానికి ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అయ్యాయి. దశలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలను ఉద్యోగ సంఘాల జేఏసీ రూపొందించింది.

ఆర్టీసీ, NGO, విద్యుత్, మునిసిపల్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు దశల వారీగా రోడ్డెక్కాలని నిర్ణయించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాల ను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళుతున్నట్టు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పరిశ్రమను కాపాడుకునేందుకు అన్నీ రాజకీయపార్టీలు ఒక్క తాటిపైకి వస్తున్నాయి. ఉక్కు కార్మిక సంఘాలు తగిలించిన ఉద్యమ సెగలు ఢీల్లికి తాకేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలు కీలకంగా మారనున్నాయి. లక్షల మందిని సంఘటితం చేయడం, పార్లమెంట్ వేదికగా గళం విప్పడం, నిరంతరం పోరాటం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించడంపై అఖిలపక్షం చర్చించింది.

ఈ మేరకు ఆందోళనలో ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా కల్పించేందుకు గేట్ మీటింగ్ లు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అదే సమయంలో ప్రజా ఉద్యమంగా మారితే పరిణామాలపైన చర్చ జరిగింది. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ లోకి దిగింది. మరోవైపు, నాన్ పొలిటికల్ జేఏసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం అవుతోంది.

  • 7
    Shares