వాట్సప్ నుంచి సిగ్నల్‌కు రెడీ అవుతున్నారా..?

34

ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సప్ నుంచి చాలా మంది సిగ్నల్ కు మారిపోతున్నారు. ప్రస్తుతం లాభాపేక్ష లేకుండా నడిపిస్తుండటమే ఆ మెసేజింగ్ యాప్ ప్రధాన బలం. వాట్సప్ చేసినట్లుగానే మెసేజ్ ల విషయంలో ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేస్తుంటుంది సిగ్నల్. ఎలోన్ మస్క్ ట్విట్టర్ వేదికగా సిగ్నల్ వాడమని హింట్ ఇచ్చేసరికి వాట్సప్ ను వదిలి వెళ్లిపోయేందుకు చాలా మంది రెడీ అయిపోయారు.

వాట్సప్ లో ఉన్న ఫీచర్లు సిగ్నల్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.వాట్సప్ మాదిరిగానే సిగ్నల్ కూడా ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. గ్రూపులో 8 మంది తో ఒకేసారి మాట్లాడవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో కూడా అందుబాటులో ఉంది. అవతలి నుంచి మరో వ్యక్తి కాల్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ వీక్ గా ఉందా.. లేదంటే అస్సలు ఇంటర్నెట్ కనెక్షన్ లేదా అని కూడా డిస్ ప్లే అవుతుంది. రింగింగ్ అనేది కనిపించకపోతే అవతలి వ్యక్తికి సరైన ఇంటర్నెట్ కనెక్షన్ లేదని అర్థం అయిపోతుంది.

కాల్ క్వాలిటీతో పోల్చుకుంటే వాట్సప్ దే పై చేయి. సిగ్నల్ లో ఇంకా లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ అందుబాటులో లేదు. మరోవైపు వాట్సప్ లో ఉన్నన్ని స్టిక్కర్లు సిగ్నల్ యాప్ లో లేవు. పేమెంట్ ఆప్షన్ కూడా సిగ్నల్ అందివ్వలేకపోతుంది. వాట్సప్ లో యూపీఐ ఐడీ యాడ్ చేసుకుని పేమెంట్ ఫీచర్ ను వాడుకోవచ్చు.

కొన్నేళ్ల నుంచి వాట్సప్ పై జరుగుతున్న దుష్ప్రచారం కారణంగా వాట్సప్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో ఒకటేంటంటే ఫార్వార్డ్ మెసేజింగ్ ఆప్షన్. ఒకటి కంటే ఎక్కువ మందికి మెసేజ్ ను పంపిస్తే చాటింగ్ లో ఫార్వార్డ్ చాలా మందికి చేశారని డిస్ ప్లే అవుతుంది.

సిగ్నల్ లో అలాంటి ఫీచర్ ఇంకా రాలేదు. చాలా తక్కువ సమయంలో తీసుకున్న నిర్ణయం కావడంతో ఎక్కువ మంది సిగ్నల్ కు మారిపోయారే కానీ, ఫీచర్ల గురించి పట్టించుకోవడం లేదు. ఈ కొన్ని అనవసరం అనుకుంటే వాట్సప్ నుంచి సిగ్నల్ కు వెళ్లిపోవచ్చు.

  • 1
    Share