ప్రైవసీ పాలసీ వల్ల ఇండియాలో వాట్సప్ ఎంతమంది అన్ ఇన్‌స్టాల్‌ చేశారో తెలుసా..?

29

కొంతమంది వాట్సాప్‌ యూజర్లు తమ మొబైల్‌ ఫోన్లలో నుంచి అన్ఇన్‌స్టాల్ చేసి ఆ ప్లేస్ లో టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌లను ఇంస్టాల్ చేస్తున్నారు. అయితే డేటా సెక్యూరిటీ విషయంలో జరుగుతోన్న చర్చపై వాట్సాప్‌ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము కొత్త పాలసీ తీసుకురావట్లేదని ప్రకటించింది. అప్పటికే వాట్సాప్‌ ఎంతో మంది యూజర్లను కోల్పోయింది.

తాజాగా నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో ఇప్పటి వరకు సుమారు 5 శాతం మంది భారతీయులు వాట్సాప్‌ను డిలీట్‌ చేశారని తేలింది. భారత్‌లో మొత్తం 40 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్స్‌ ఉండగా అందులో సుమారు 2 కోట్ల మంది యాప్‌ను అన్‌ ఇన్‌స్టాల్‌ చేశారని అంచనా. ఇక 21 శాతం మంది వాట్సాప్‌ వాడకాన్ని తగించేశారని తేలింది.