పిల్లలు పుట్టడంలేదని ఆస్పత్రికి.. అంతలోనే ఘొరం..

37

కారు బోల్తా పడిన ఘటనలో భార్యాభర్తలు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన కామారెడ్డి లోని మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి శివారులో 11వ రాష్ట్ర రహదారి పై సోమవారం రాత్రి 10గం. ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఏల్పుగొండ నుంచి గంభీరావుపేటకు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. దోమకొండ మండలం ముత్యంపేటకు చెందిన శివుల రేణుక (25), ప్రవీణ్‌ (25) దంపతులు, శివుల లక్ష్మి (45) (ప్రవీణ్‌ తల్లి), బాలవ్వ(65), ఏల్పుగొండకు చెందిన కొంపల్లి నర్సింలు, భార్య లక్ష్మి(రేణుక తల్లిదండ్రులు), కూతురు అఖిల (రేణుక చెల్లెలు)కారులో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు బయలుదేరారు.

https://i.imgur.com/K2kBMIv.jpg

వాహనం మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి సమీపానికి చేరుకోగానే అదుపు తప్పి రోడ్డుకు కుడివైపునకు దూసుకుపోయింది. నాలుగు పల్టీలు కొడుతూ పొదల్లోకి వెళ్లి బోల్తా పడింది. కారు నడుపుతున్న ప్రవీణ్‌ ముందు సీట్లో కూర్చున్న ఆయన భార్య రేణుక, శివుల లక్ష్మి, బాలవ్వకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ప్రవీణ్‌, రేణుక దంపతులు మరణించారు. తీవ్రంగా గాయపడిన శివుల లక్ష్మి, బాలవ్వ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న కొంపల్లి నర్సింలు, లక్ష్మి, అఖిల పాణాలతో బయట పడ్డారు. ఘటనా స్థలానికి మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి చేరుకొని వివరాలు ఆరాతీశారు.

  • 4
    Shares