వాలెంటైన్స్ డే రోజు భార్యకు కాస్ట్లీ గిఫ్ట్.. దుమ్మెత్తి పోసిన నెటిజన్లు..?

37

దక్షిణాఫ్రికాకు చెందిన  మెరెలైజ్ వాన్ డెర్ మెర్వే అనే మహిళ చనిపోయిన జిరాఫీ హృదయాన్ని పట్టుకొని ఓ ఫోటోను తన సోషల్ మాధ్యమాల ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోని ఉద్దేశించి తన వాలెంటైన్ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తనకి జిరాఫీ గుండెను ఇచ్చాడని తెలిపింది. ఆ జంతువును చంపడానికి తన భర్త ఏకంగా ఒక లక్ష రూపాయలను చెల్లించాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ పెట్టి పెట్టగానే ఆ పోస్ట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

ఆ జిరాఫీ గుండె తనకి వాలెంటైన్ గిఫ్ట్ గా ఇచ్చినందుకు తాను కచ్చితంగా చంద్రునిపై ఉన్నానని ఫీల్ అవుతున్నాను అంటూ  ఆ పోస్టులో తెలిపింది. అంతేకాదు ఆ చనిపోయిన జిరాఫీ చర్మాన్ని తాను పడుకునే సమయంలో రగ్గుగా ఉపయోగించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ దంపతులు ఇప్పటివరకు ఆ ప్రాంతాలలో 500 జంతువులకు పైగా హతమార్చినట్లు అటవీ అధికారులు తెలుపుతున్నారు.

  • 7
    Shares