జొమాటో డెలివరి బాయ్ ని చెప్పుతో కొట్టిన లేడి కస్టమర్

277

బెంగళూరు యువతి హితేషా చంద్రానీ అనుకున్న సమయానికి ఆర్డర్ రాకపోవడంతో కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి తన ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయాలని కోరింది. అయితే, ఇంతలోనే డెలివరీ బాయ్‌ఆర్డర్‌ తీసుకురాగా.. తనకు వద్దంటూ ఆమె వాదనకు దిగింది. దీంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు.

ఆ యువతే తనను తిట్టి, చెప్పుతో కొట్టిందని జొమాటో డెలివరీ బాయ్ ఆరోపించాడు. వీటిని ఆమె తీవ్రంగా ఖండించింది. ఆర్డర్ ఆలస్యం కావడంతో కస్టమర్ కేర్‌కు ఫోన్‌చేసి క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పానని తెలిపింది. తనకు ఆర్డర్ వద్దని చెప్పడంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ ఆగ్రహంతో నా సమయం వృధా చేయకుండా డబ్బులు ఇవ్వాలని నాపై దాడి చేశాడని తెలిపింది.

తర్వాత తన ఆర్డర్‌ను తీసుకొని మరీ పారిపోయాడని ఆమె చెప్పారు. నా ముక్కుపై బలంగా గుద్దడంతో రక్తం కారుతున్న విషయాన్ని గమనించకుండా అతడి వెనుకాల పరుగెత్తి, ఆపడానికి ప్రయత్నించానని బాధితురాలు అన్నారు. లిఫ్ట్‌ దగ్గర అడ్డుకున్న తనపై మరోసారి కొట్టి, మెట్ల గుండా కిందికి వెళ్లిపోయాడని వాపోయింది.

ఆమె ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమే తనను నోటికొచ్చినట్టు తిట్టి, చెప్పుతో కొట్టిందని అన్నాడు. ఆ తర్వాత ఆమెపై తాను చేయిచేసుకున్నానని అన్నాడు. దీనికి క్షమాపణలు చెప్పి అనంతరం జొమాటాతో మాట్లాడి పార్సిల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆమె తిరస్కరించారని చెప్పాడు.

అంతేకాదు, ఆమె చేతి వేలికి ఉన్న ఉంగరం వల్లే ముక్కుకు గాయమైందంటూ ఆరోపించాడు. అయితే, వీటిని యువతి తీవ్రంగా ఖండించింది. తాను డెలివరీ బాయ్‌ను తిట్టలేదని, అతడే ముందు అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.

  • 8
    Shares