This Day in History: 1981-05-03

1981 : పద్మశ్రీ నర్గీస్ దత్ (ఫాతిమా రషీద్) మరణం. భారతీయ హిందీ సినీ నటి, రాజకీయవేత్త. నటుడు సంజయ్ దత్ ఈమె కుమారుడు. సుప్రసిద్ధ నటుడు అన్వర్ హుస్సేన్ యొక్క చెల్లెలు. సుప్రసిద్ధ నటుడు సునీల్ దత్ ను వివాహం చేసుకుంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో గొప్ప నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతున్న ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో తలాష్-ఎ-హక్‌తో చిన్న పాత్రలో తెరపైకి వచ్చింది. ఆమె నటనా జీవితం వాస్తవానికి తమన్నా చిత్రంతో ప్రారంభమైంది. ఆస్కార్ కు నామినేట్ చేయబడిన మదర్ ఇండియా చిత్రంతో బాగా ప్రసిద్ధి చిందింది. 1982లో, ఆమె జ్ఞాపకార్థం నర్గీస్ దత్ మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించబడింది.

 పద్మశ్రీ బిరుదు పొందిన మొదటి సినీ నటి. మదర్ ఇండియా కోసం కార్లోవీ వేరీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. రాత్ ఔర్ దిన్ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం. నటుడు అమితాబ్ బచ్చన్‌తో పాటు హీరో హోండా మరియు ఫిల్మ్ మ్యాగజైన్ స్టార్‌డస్ట్ ద్వారా “బెస్ట్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ది మిలీనియం” అవార్డు. 2011లో, Rediff.com ఆమెను “ఎప్పటికైనా గొప్ప భారతీయ నటి”గా పేర్కొంది. 2010లో CNN ద్వారా “చరిత్రలో 25 మంది గొప్ప ఆసియా నటులు” లో జాబితా చేయబడింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు ఆమె గౌరవార్ధం నర్గీస్ దత్ అవార్డును స్థాపించి సత్కరించింది. ఆమె గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.

 

error: