tomorrow – On This Day  

tomorrow

దినోత్సవం

ప్రపంచ శాకాహార దినోత్సవం

అంతర్జాతీయ లెనాక్స్-గ్యాస్టాట్ సిండ్రోమ్ అవగాహన దినోత్సవం

ఆంటిగ్వా మరియు బార్బుడా స్వాతంత్ర్య దినోత్సవం (యునైటెడ్ కింగ్ డమ్ నుండి)

సంఘటనలు

1956 : ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి పదవి నుండి బెజవాడ గోపాల రెడ్డి పదవీ విరమణ చేశాడు.

1956 : భారతదేశంలోని ఐదు స్వతంత్ర రాష్ట్రాలు అయినటువంటి మైసూర్ రాచరిక రాష్ట్రం, నిజాం హైదరాబాద్, బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు కొడగు భూభాగంతో 'మైసూరు రాష్ట్రం' (కర్ణాటక) ఏర్పడింది.

1956 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1956 : హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఒక భాగాన్ని బొంబాయి రాష్ట్రం, ఒక భాగాన్ని మైసూర్ రాష్ట్రం, ఒక భాగాన్ని  ఆంధ్ర రాష్ట్రంతో కలిపి మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.

1956 : హిమాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది.

1956 : ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.

1966 : హర్యానా మొదటి ముఖ్యమంత్రిగా భగవత్ దయాళ్ శర్మ పదవి బాధ్యతలు స్వీకరించాడు.

 

1973 : మైసూరు రాష్ట్రం పేరు 'కర్ణాటక' గా మార్చబడింది.

2000 : మధ్యప్రదేశ్ లోని 16 ఆగ్నేయ జిల్లాలతో రాయ్‌పుర్ రాజధానిగా 'ఛత్తీస్‌గఢ్' రాష్ట్రం ఏర్పాటు చేయబడింది.

జననం

1897 : దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జననం. భారతీయ తెలుగు కవి, సినీ-నాటక రచయిత, అనువాదకుడు. ఆయన్ని ఆంధ్రా షెల్లీ అని పిలుస్తారు. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్‌తో సత్కరించింది. సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఆంధ్ర విశ్వ విధ్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం లభించింది.

1924 : పద్మ భూషణ్ రామ్ కింకర్ ఉపాధ్యాయ్ జననం. భారతీయ కవి, కధకుడు, రచయిత, సాధువు, ఆధ్యాత్మికవేత్త, పండితుడు. రామచరత్తమానస్ మరియు రామకథపై 92 పుస్తకాలను రచించాడు.

1940 : రమేష్ చంద్ర లహోటి జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ సుప్రీంకోర్టు 35వ ప్రధాన న్యాయమూర్తి.

1973 : పద్మశ్రీ ఐశ్వర్య రాయ్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. మిస్ వరల్డ్ 1994 టైటిల్ విజేత. మిస్ ఇండియా 1994 మొదటి రన్నర్అప్. మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ క్యాట్ వాక్, మిస్ పాపులర్, మిస్ మిరాక్యులస్ టైటిల్స్ విజేత. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ సినీ నటి.

1974 : వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ జననం. భారతీయ మాజీ అంతర్జాతీయ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, టెస్ట్ క్రికెట్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. భారతదేశ క్రికెట్ జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. పద్మశ్రీ పురస్కారం పొందాడు, గౌరవ డాక్టరేట్, అర్జున అవార్డులు అందుకున్నాడు.

1987 : ఇలియానా డిక్రుజ్ జననం. భారతీయ పోర్చుగీస్ సినీ నటి, మోడల్.

మరణం

1989 : హరనాథ్ (బుద్దరాజు వెంకట అప్పల హరనాథ్ రాజు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు.

1996 : జె.ఆర్. (జూనియస్ రిచర్డ్ జయవర్ధనే) మరణం. శ్రీలంక రాజకీయవేత్త. 2వ అధ్యక్షుడు, 7వ ప్రధాన మంత్రి, సిలోన్ (ఇప్పుడు శ్రీలంక) లో జాతీయవాద ఉద్యమానికి నాయకుడు.

చరిత్ర కొనసాగుతుంది..