This Day in History: 1946-06-04

1946 : పద్మ విభూషణ్ బాలు (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) జననం. భారతీయ నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సంగీత దర్శకుడు, సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత. ఆయనను ఎస్పీబి, బాలు అని కూడా పిలుస్తారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలొ పనిచేశాడు. గొప్ప భారతీయ గాయకులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. 40,000 పాటలతో అత్యధిక సంఖ్యలో పాటలను రికార్డ్ చేసిన గాయకుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా సిల్వర్ పీకాక్ మెడల్‌తో సత్కరించబడ్డాడు. కేరళ ప్రభుత్వం నుండి హరివరాసనం అవార్డు గ్రహీత. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, కలైమామణి, కళాప్రపూర్ణ, కళా ప్రియదర్శిని లాంటి అనేక పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు పొందాడు.

ఫిల్మ్ ఫేర్, ఫిల్మ్ ఫేర్ సౌత్, నేషనల్ ఫిల్మ్ అవార్డు, సైమ, నంది, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ లాంటి అవార్డులతో పాటు అనేక ఇతర అవార్డులను అందుకున్నాడు.

 

error: