This Day in History: 1951-05-06

1951 : పద్మశ్రీ లీలా శాంసన్ జననం. భారతీయ భరతనాట్య నర్తకి, కొరియోగ్రాఫర్, శిక్షకురాలు, రచయిత్రి, సినీనటి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలొ పనిచేసింది. ఏప్రిల్ 2005లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కళాక్షేత్ర డైరెక్టర్‌గా నియమించబడింది. ఆగస్ట్ 2010లో సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. ఏప్రిల్ 2011లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) చైర్‌పర్సన్‌గా ఉంది.

మణిరత్నం దర్శకత్వం వహించిన ఓకే కన్మణి అనే తమిళ చిత్రం ద్వారా ఆమె 2015లో సినీ నటిగా రంగప్రవేశం చేసింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, పద్మశ్రీ, సంస్కృతి, నృత్య చూడామణి, కలైమామణి, సంగీత నాటక అకాడమీ, నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను అందుకుంది.

error: