This Day in History: 1983-05-06

1983 : పద్మశ్రీ గగన్ నారంగ్ జననం. భారతీయ షూటింగ్ క్రీడాకారుడు. 2006 కామన్వెల్త్ క్రీడలలో 4 బంగారు పతకాలను సాధించాడు. అందులో రెండు వ్యక్తిగత పతకాలు కాగా మరో రెండు పెయిర్స్‌లో అభినవ్ బింద్రాతో కలసి సాధించాడు. 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర లిఖించాడు.

2003లో హైదరాబాదులో జరిగిన ఆఫ్రో-ఏషియన్ క్రీడలలో పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ స్వర్ణపతకం సాధించాడు. 2006లో జరిగిన ప్రపంచ కప్ షూటింగ్ క్రీడలలో ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారుపతకం సాధించాడు. 2008లో జరిగిన ప్రపంచ కప్‌లో రజతపతకంతో సరిపెట్టుకున్నాడు. 2006 కామన్వెత్ క్రీడలలో 4 స్వర్ణపతకాలను సాధించాడు. అందులో రెండు వ్యక్తిగత విభాగంలోనివి (10మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల ఎయిర్ రైఫిల్) కాగా మరో రెండు పతకాలను అభినవ్ బింద్రాతో కలిసి పెయిర్స్‌లో (10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పెయుర్స్, 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ పెయిర్స్ 3వ పొజీషన్) విజయం సాధించాడు. ఒలింపిక్ క్రీడలు జరుగడానికి ముందు జర్మనీలోని హనోవర్‌లో జరిగిన పోటీలో 704.3 పాయింట్లతో ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ రికార్డును మెరుగుపర్చాడు. 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకుని అభినవ్ బింద్రా తరువాత భారత్ తరపున ఒలింపిక్ పతకాన్ని సాధించిన రెండవ షూటింగ్ క్రీడాకారుడిగా నిలిచాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్నాడు.

error: