This Day in History: 1988-07-06

మాళవిక

మాళవిక ఒక తెలుగు సినీ నేపథ్య గాయని. అనేక ప్రేక్షకాదరణ పొందిన పాటలను పాడింది. చిరు ప్రాయంలోనే తన తల్లి వద్ద సంగీత శిక్షణ తీసుకున్నది. ఈమె తల్లి ఒక సంగీత ఉపాధ్యాయురాలు. తర్వాత శాస్త్రీయ సంగీతంలో కుమారి మందపాక శారద గారి వద్ద శిక్షణ పొందింది. విశాఖపట్నం లోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాల నుండి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఈమె తల్లి కూడా ఇదే పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేసేది.చిన్నప్పటినుండి వీరి ఇంటిలో సంగీత వాతావరణం మధ్య పెరిగింది. చిన్నప్పటినుండి విశాఖపట్నం, చుట్టుపక్కల జరిగిన అనేక పాటలపోటీలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నది. సినీరంగంలో అవకాశాలు పెరగడంతో వీరి కుటుంబం హైదరాబాదుకి మకాం మార్చింది. 2013 ఫిబ్రవరి 15న ఈమె వివాహం ఒరిస్సా రాష్ట్రం బరంపురంకు చెందిన కృష్ణ చైతన్యతో జరిగింది.

error: