This Day in History: 1984-05-12

1984 : పద్మ భూషణ్ రాజా సర్ ముత్తయ్య అన్నమలై ముత్తయ్య చెట్టియార్ మరణం. భారతీయ బ్యాంకర్, రాజకీయవేత్త, పరోపకారి, సాంఘిక మరియు సాంస్కృతిక కార్యకర్త. భారత రాజ్యాంగ సభ సభ్యుడు. విద్య మరియు ఎక్సైజ్ మంత్రి (మద్రాస్ ప్రెసిడెన్సీ). వంశపారంపర్యంగా ‘కుమార్-రాజా’ తరువాత ‘చెట్టినాడ్ రాజా’ బిరుదు పొందాడు. తండ్రి రాజా సర్ అన్నమలై చెట్టియార్ తో కలిసి తమిళనాడులోని చిదంబరం పట్టణంలో అన్నమలై విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 1941 కింగ్స్ బర్త్‌డే లో నైట్‌గా బిరుదు పొందాడు. చెట్టినాడ్ హౌస్‌లో క్వీన్ ఎలిజబెత్ II మరియు  ఎడిన్బర్గ్ డ్యూక్ కోసం లంచ్‌ని ఏర్పాటు చేసిన అరుదైన గౌరవాన్ని కూడా పొందాడు. భారత ప్రభుత్వం 1973లో ఆయనకు పద్మభూషణ్ అందించింది. తమిళనాడు ప్రభుత్వం 1979లో “తమిళ ఇసై కావలర్” బిరుదుతో సత్కరించింది. 1982లో న్యూయార్క్ వరల్డ్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

error: