This Day in History: 1902-06-12

1902 : పాలకోడేటి శ్యామలాంబ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు.

ఆమె 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏడు నెలల పాటు, 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ పాల్గొని ఆరు నెలల పాటు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. ముఖ్యంగా యువతలో దేశభక్తి పెంపొందించి స్వాతంత్య్ర ఉద్యమం వైపు మళ్లించాలనే సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమ స్ఫూర్తిని వెలిగించింది.

ఈమె భర్త సూర్యప్రకాశరావు కూడా స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, ప్రేమజ్యోతి అనే పత్రికాసంపాదకుడు.

 1946 నుండి 1953 వరకు రాజమండ్రి పురపాలక సంఘ సభ్యురాలిగా రాజమండ్రి నగర పారిశుధ్యంపై శ్రద్ధ వహించింది. ఈమె, ఈమె భర్త ప్రకాశరావు ఒకేసారి రాజమండ్రి కౌన్సిలర్లుగా ఎన్నుకోబడ్డారు.

error: