This Day in History: 1999-06-12

1999 : జలగం వెంగళ రావు మరణం. భారతీయ రాజకీయవేత్త, రచయిత. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి. కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేసాడు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో కాకతీయ విశ్వవిద్యాలయం, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, రాయలసీమ ప్రాంతంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనే మూడు విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి. 1975లో హైదరాబాద్‌ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించాడు. నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా ప్రసిద్ధిచెందాడు.

error: