This Day in History: 1962-07-14
గీత కాదంబి
గీత కాదంబి (జ. 14 జూలై 1962) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఈమె భైరవి అనే తమిళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమాలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించింది. అప్పటి నుండి సుమారు 200కు పైగా అన్ని దక్షిణ భారతీయ చిత్రాలలో, కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. ఈమె కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. ఈమెకు రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఒక కర్ణాటక రాష్ట్ర ఫిలిం అవార్డు, ఒక కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డు లభించాయి.
పురస్కారాలు
- కర్ణాటక రాష్ట్ర ఫిల్మ్ అవార్డులు
- ఉత్తమ నటి – అరుణ రాగ (1986)
- కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డులు
- ద్వితీయ ఉత్తమ నటి – ఒరు వదక్కన్ వీరగాధ (1989)
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (దక్షిణ)
- ఉత్తమ నటి కన్నడ – శృతిసేరిదాగ
- ఉత్తమ నటి మలయాళం – ఆధారం
- సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు
- ఉత్తమ నటి మలయాళం – వైశాలి (1988)
గీత నటించిన తెలుగు చిత్రాలు
- మన ఊరి పాండవులు (1978)
- ఇద్దరూ అసాధ్యులే (1979)
- అందమైన అనుభవం (1979)
- కార్తీక దీపం (1979)
- చెయ్యెత్తి జైకొట్టు (1979)
- ఛాలెంజ్ రాముడు (1980)
- తాతయ్య ప్రేమలీలలు (1980)
- అద్దాలమేడ (1981)
- కొండవీటి సింహం (1981)
- తోడుదొంగలు (1981)
- అల్లుడు గారూ జిందాబాద్ (1981)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1982)
- మరో మలుపు (1982)
- టింగు రంగడు (1982)
- కలవారి సంసారం (1982)
- చలాకీ చెల్లెమ్మ (1982)
- సాగర సంగమం (1983)
- ఇదికాదు ముగింపు (1983)
- మూడు ముళ్ళు (1983)
- ప్రేమ పిచ్చోళ్ళు (1983)
- అల్లుళ్ళొస్తున్నారు (1984)
- ఈ చదువులు మాకొద్దు (1984)
- బ్లాక్ టైగర్ (1989)
- కోకిల (1990)
- బాలచంద్రుడు (1990)
- ఆపద్బాంధవుడు (1992)
- అశ్వమేధం (1992)
- దళపతి (1992)
- నిప్పురవ్వ (1993)
- వారసుడు(1993)
- ద్రోహి (1995)
- ఒక్కడు (2003)
- జానీ (2003)
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
- పౌర్ణమి (2006)
- కథానాయకుడు (2008)
- కింగ్ (2008)
- పిస్తా (2009)
- రచ్చ (2012)
- తూనీగ తూనీగ (2012)
- షాడో (2013)
- లయన్ (2015)
- మనసుకు నచ్చింది (2018)
- వెంకీ మామ (2019)