This Day in History: 1935-07-18

1935 : కంచి కామకోటి పీఠానికి 69వ శంకరాచార్యులు జయేంద్ర సరస్వతి జననం

శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగళ్ (జూలై 18, 1935 – ఫిబ్రవరి 28, 2018) (బాల్యనామం:సుబ్రహ్మణ్య అయ్యర్) కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి.

సుబ్రహ్మణ్య మాధవీయ అయ్యర్ ఆయనకు పూర్వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి చే నామినేట్ చేయబడ్డారు. పీఠాధిపతి అయిన తరువాత “శ్రీ జయేంద్ర సరస్వతి” గా మార్చి 24, 1954 నుండి పిలువబడుతున్నారు.

హిందూధర్మ ప్రచారంలో కొన్ని దశాబ్దాల నిష్టాగరిష్టమైన జీవితాన్ని గడిపిజయేంద్ర సరస్వతి 1935లో జనవరి 18వ తేదీన తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకి లో జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ. ఆయన కంచీ పీఠానికి 69వ శంకరాచార్య గా ఆయన పీఠాధిపతి అయ్యారు. నడిచేదేవుడిగా పేరున్న కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి తరువాత జయేంద్ర సరస్వతి పీఠాధిపతి అయ్యారు. ఆయన 1954 మార్చి 22 నుంచి కంచి పీఠాధిపతి గా ఉన్నారు . కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి బుధవారం హేవిలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుద్ధ త్రయోదశి నాడు పరమదించారు.

error: