This Day in History: 1930-10-20

1930 : లీలా సేథ్ జననం. భారతీయ న్యాయవాది, న్యాయమూర్తి. ఢిల్లీ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి. హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. లండన్‌ బార్‌ పరీక్షల్లో టాప్‌గా నిలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆ పరీక్షకు కొన్ని రోజుల ముందే మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో బిడ్డను ఎత్తుకుని ఉన్న లీలా సేథ్‌ ఫోటోను ‘మదర్‌-ఇన్‌-లా’ అనే క్యాప్షన్‌తో లండన్‌ పత్రిక ప్రచురించింది. అదే ఏడాది ఐఎఎస్‌ అధికారిగా ఎంపికయ్యారామె. కాని ఆమెకు న్యాయవాది వృత్తిపట్ల అభిమానంతో ఆ వృత్తిని చేపట్టినది. 1959వ సంవత్సరంలో కొల్‌కతా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆ తరువాత సుప్రీంకోర్టులో పేరు నమోదయ్యింది. పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా తొలుత ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అక్కడే పదేళ్లు ఉన్నారు. తర్వాత కొల్‌కతాలో కొన్నాళ్లు ఉన్నాక ఢిల్లీకి వెళ్లి అక్కడ ఐదేళ్లు ముఖ్యమైన పలు విభాగాల్లో పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టుకి 1978లో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టుల్లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆగస్టు 5, 1991న హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఏడాది పదవీవిరమణ చేశారు. అయితే ఆ తరువాత కూడా ‘లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’లో 2000 సంవత్సరం వరకూ పనిచేశారు. అప్పుడే హిందూ వారసత్వ చట్టంలో కొన్ని సవరణలు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కూతుళ్లకు కూడా సమానహక్కు ఉంటుందని తీసుకొచ్చిన సవరణలో ఆమె పాత్ర ఎంతో కీలకం. 2012 ఢిల్లీ అత్యాచారం కేసులో అత్యాచార నిరోధక చట్టం రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది.

error: