This Day in History: 1966-06-24

విజయశాంతి సట్టి

విజయశాంతి ( జననం:జూన్ 24, 1966 ) తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె “ద లేడీ సూపర్ స్టార్”, “లేడీ అమితాబ్” గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.




జీవిత విశేషాలు: ఈమె జూన్ 241966న వరంగల్లో జన్మించి, మద్రాసు లో పెరిగింది. విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది. ఇక ఆమె ఇంటి పేరు సట్టి. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ; చిత్ర దర్శకురాలు విజయనిర్మల.

విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పోషించింది. వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్, ఏయెన్నార్ ల కలయికలో వచ్చిన ‘సత్యం – శివం’లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తు పెట్టుకోదగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన నేటి భారతం. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరిందని సినీ పరిశ్రమలో వినికిడి.




ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది. 1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవి తో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి.

ఆమె అగ్నిపర్వతం (సినిమా)ప్రతిఘటనరేపటి పౌరులుపసివాడి ప్రాణంమువ్వగోపాలుడుయముడికి మొగుడుఅత్తకి యముడు అమ్మాయికి మొగుడుజానకిరాముడుముద్దుల మావయ్యకొండవీటి దొంగలారీ డ్రైవర్శత్రువు (సినిమా)గ్యాంగ్ లీడర్రౌడీ ఇన్‌స్పెక్టర్మొండిమొగుడు పెంకి పెళ్ళాంచినరాయుడు వంటి విజయవంటమైన సినిమాలలో నటించింది. ఆమె 1980లలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.

error: