This Day in History: 1915-05-25
1915 : దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ అహ్మదాబాద్‌లోని కొచ్రాబ్‌లో తన మొదటి ఆశ్రమమైన ‘సత్యాగ్రహ ఆశ్రమం’ స్థాపించాడు.
ఈ కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించేందుకు బారిస్టర్ జీవన్‌లాల్ దేశాయ్ తన బంగ్లాను అందించాడు. సత్యాగ్రహ ఆశ్రమం సబర్మతీ ఆశ్రమానికి మారడానికి ముందు గాంధీజీ ఈ ఆశ్రమంలో ఒకటిన్నర సంవత్సరాలు ఉన్నాడు.